Home News Updates

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాష్ట్రంలో సంక్షేమ రంగం పూర్తిగా గాలికి వదిలేసారని తెరాస ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి కేటీఆర్ కాబోయే సీఏం అంటూ కామెంటులు చేయడం పాలనను గాలికి వదిలేసినట్టేనని భట్టి విమర్శించారు. సీఎం పేరుతో తెరాస మంత్రులు ఎమ్మెల్యేలు కాలయాపన చేస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తారనే ప్రజలు నాయకులను ఎన్నుకున్నారన్న ఆయన ప్రజా సంక్షేమాన్ని ఈప్రభుత్వం పూర్తిగా విస్మరించిదని ఆక్షేపించారు. రాష్ట్రంలో సచివాలయం లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసనేనని విమర్శించారు. మంత్రులు , ఉన్నతాధికారులు ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదని భట్టి విక్రమార్కా ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనను చూసి రాష్ట్ర ప్రజలంతా ఆందొళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు.

అదేవిధంగా భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలకు అంతే లేకుండా పోయిందని భట్టి అన్నారు. ఎప్పుడు మాట్లాడినా అవినీతిపరులపై కేసులు పెడతామని అంటారు కాని ఇంతవరకు కేసులు పెట్టిందే లేదని తెలిపారు. బీజేపీ నేతలు కేవలం మాటలు తప్ప చేతలు లేవని ఎద్దేవ చేశారు భట్టి. బీజేపీ నేతలు నిజంగానే అవినీతిపరులపై దర్యాప్తు జరిపితే మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రారంభించాలని అన్నారు. 28 కోట్లతో పూర్తి అయ్యే కాళేశ్వరం నేటి ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణలో అవినీతి జరింగిందనడానికి ఇంతకంటే పెద్ద ఉదహారణ ఏముంటుందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here