రోజుకో టీఆర్ఎస్ నేత వారి మాటలతో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిస్తున్నారు.
వారి వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయాల్లో చర్చలకు దారితీయగా ఇప్పుడు మానుకొండూరు ఎమ్మెల్యే తెరమీదకి వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓసంతాప సభలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రసమయి సోమవారం వచ్చారు. అక్కడి సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ..సమాజంలో కవులు, కళాకారులు మోనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
అంతేకాక ప్రస్తుతం తానొక లిమిడెట్ కంపెనీలో పనిచేస్తున్నానంటూ..తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలమంది కవులు, కళాకారులకు దూరమయ్యానని రసమయి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా రసమయి చెప్పిన లిమిటెడ్ కంపేనీపైనే మానుకోట జిల్లా అధికార అసమ్మతినేతల్లో చర్చ సాగుతోంది. గతంతో ప్రభుత్వ పథకాలపై కేసీఆర్ పై అసెంబ్లీలోనే పాటలు పాడిన బాలకిషన్ ఇప్పుడు ఓలిమిటెడ్ లో పనిచేస్తున్నా అని అన్నాడు ఏందుకూ అని జిల్లాలోని నేతలు గుసగుస లాడుతున్నారట.