Home Health corona

ఒక్క ఆటగాడు చేసిన తప్పుకు ఐపీఎల్ రద్దైందా..బీసీసీఐ నష్టం 2వేల కోట్ల పైమాటే…!

ఐపీఎల్ లో కరోనా కల్లోలం రేగడంతో టోర్నీని బీసీసీఐ రద్దు చేసింది. ఆటగాళ్లను బయోబబుల్‌ ట్రేసింగ్ లో ఉంచినప్పటికీ కరోనా మహమ్మారి ఆటగాళ్లకు ఎలా సోకిందో బోర్డుకు అంతుచిక్క లేదు. ఇప్పుండందున్నతున్న సమాచారం మేరకు ఒక్క ఆటగాడి ఆజాగ్రత్తకు టోర్నీ మొత్తం బలైనట్లు తెలుస్తుంది. చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చింది. కేకేఆర్ జట్టు ఆటగాళ్ల నుంచి ఈ కరోనా సెగ తగిలింది. మొదట వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత సందీప్ వారియర్,అమిత్ మిశ్రా ఇలా కేకేఆర్ టీం ని వైరస్ చుట్టబెట్టేసింది.

ఇటీవల ఓ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. ఈ క్రమంలో వరణ్‌ కి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత వరుణ్ క్వారంటైన్ లో ఉండకుండా నిబంధనలు ఉల్లంఘించి తోటి ఆటగాళ్లు సందీప్,అమిత్ మిశ్రాని కలిశాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైనట్లు భావిస్తున్నారు. అందుకే బోర్డు దీనిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. అసలు బయోబబుల్‌ లీక్‌ పై విచారణ జరిపిస్తోంది. ఇలా ఒకరి తర్వాత ఒకరికి వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తుంది.

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు వరుణ్ చక్రవర్తి కారణమంటూ అతని పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ అర్దాంతరంగా రద్దవ్వడంతో బీసీసీఐతో పాటు బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంచైజీలు భారీగా నష్టపోనున్నాయి. సగం మ్యాచ్​లే పూర్తవ్వడంతో బీసీసీఐకి దాదాపు 2 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మిగిలిన మ్యాచ్‌ల యాడ్ ఆదాయం నష్టపోనుంది. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి. అయితే క్రికెటర్లకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదని తెలుస్తోంది. ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం వారికి ఫ్రాంచైజీలు పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here