Home News

క్రికెట్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్: ఐపీఎల్ వాయిదా…!

క్రికెట్ ప్రేమికులను అల్లరిస్తున్న ఐపీఎల్‌ కరోనా కాటుకు బలైంది. నిన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఈ సీజన్ ఐపీఎల్ ని అర్దాంతరంగా వాయిదా వేసింది. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత వేధిస్తుంటే వాటి సంగతి చూడడం మానేసి తీరిగ్గా ఐపీఎల్ నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఆటగాళ్లకు కూడా కరోనా సెగ తగలడంతో టోర్నీ వాయిదా వేసింది బీసీసీఐ.

నిజానికి టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి డిమాండ్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఐపీఎల్‌లో పరుగుల కంటే వేగంగా బయట ప్రాణాలు పోతున్నాయని, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సరికాదంటూ పలువురు విమర్శించారు క్రీడా నిపుణులు. విదేశీ మీడియా కూడా ఐపీఎల్ నిర్వహణను తప్పబట్టింది. ఐపీఎల్ కంటే దృష్టిపెట్టాల్సిన తీవ్రమైన అంశాలు భారత్‌లో ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ పట్టించుకోని బీసీసీఐ టోర్నీ నిర్వహణకే మొగ్గు చూపింది.

ఈ సీజన్‌లో ఇంకా 30కి పైగా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్రికెట్ క్యాలెండర్, కోవిడ్ పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్‌లను రీ షెడ్యూల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here