Home Videos

స్పుత్నిక్ వి టీకా పనితీరు పై అసలు నిజాలు ఇవే…!

కరోనా మహమ్మారికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రజలకు ఇప్పటికే ఇస్తుండగా తాజాగా రష్యాలో తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడింట్లో ఏ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు మూడూ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవాగ్జిన్‌ను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి డోసులు భారత్‌కు వచ్చాయి. దీన్ని మాస్కోలోని గమలేయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీలో.. రష్యన్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సహాయంతో అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పర్యవేక్షణలో.. ఆరు ఇండియన్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని గర్భిణులు,బాలింతలు కూడా తీసుకోవచ్చని సమర్ధంగా పని చేస్తుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here