Home Entertainment Cinema

నితిన్ పెళ్ళికి చిరంజీవికి ఓ లింకు!

చాలా మందికి ఆశ్చర్యమేసే విషయం ఇది. నిజంగానే నితిన్ కు కాబోయే అత్తారింటితో చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్ల పరిచయం కూడా ఉంది. నితిన్ చేసుకోబోయే అమ్మాయి తెలంగాణలోని నాగర్ కర్నూల్ నుంచి వచ్చింది. అక్కడే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు. 20 ఏళ్లుగా ఇదే రంగంలో ఉన్నారు. అక్కడ వాళ్ల హాస్పిటల్స్ కు మంచి పేరుంది. వాళ్ల పేర్లు సంపత్ కుమార్, నూర్జహాన్. ఈ ఇద్దరి ముద్దుల కూతురు షాలిని. ఈమెతోనే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు నితిన్. ఇప్పుడు పెద్దల అంగీకారంతోనే ఒక్కటి కాబోతున్నారు. ఎప్రిల్ 16న నితిన్ ను పెళ్లి చేసుకోబోతుంది ఈమె. ఈ జంటకు ఇప్పటికే చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆ వెల్లువ సాగుతూనే ఉంది. నితిన్ నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి షాలిని గురించి వివరాల కోసం చూస్తూనే ఉన్నారు నెటిజన్లు.

ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది. నితిన్ అత్తారింటితో చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటి మాట కాదు ఇది. పదేళ్ల కింది మాట. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు రాజకీయంగా ఈ కుటుంబంతో చిరంజీవికి అనుబంధం ఏర్పడింది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు నాగర్ కర్నూల్ నుంచి నూర్జహాన్ పార్టీలో చేరారు. అప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు మెగాస్టార్. అయితే 2009 అసెంబ్లీ ఆమె ఓడిపోయింది. తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయింది నూర్జహాన్. అప్పుడు వార్తల్లోంచి మాయమైపోయి ఇప్పుడు కూతురు పెళ్లితో మరోసారి నిలిచింది. మొత్తానికి నితిన్ అత్తగారికి చిరంజీవితో మంచి స్నేహం ఉందన్నమాట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here