Home Health corona

రెమిడెసివర్ బ్లాక్ దందా పక్కా ప్లానింగ్ నడుస్తోంది ఇలా

కరోనా సమయంలో ఆక్సీజన్,వ్యాక్సిన్ సమస్యతోనే సాధరణ ప్రజానికం ఇబ్బంది పడుతుంటే యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివర్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. ఎక్కడ చూసిన రెమిడిసివర్ ఇంజక్షన్ దొరక్క కోవిడ్ బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే బ్లాక్ మార్కెట్లో మాత్రం యధేచ్చగా దొరుకుతోంది. బయట కృత్రిమ కొరత సృష్టించడం బ్లాక్‌ మార్కెట్‌లో మాత్రం…డబ్బులిస్తే ఎంత కావాలో అంత దొరుకుతోంది.

ఒక వైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులతోపాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయ్. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు నేలపైనే చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా మందుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌ వ్యాక్సిన్‌ సరిపడా స్టాక్‌ లేదు. ఒక్క డోస్ లక్ష నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారు. రెమిడెసివిర్‌ దందాను…పక్కా ప్లాన్‌తో నడిపిస్తున్నారు కేటుగాళ్లు. సంప్రదిస్తున్న వారికి డబ్బు పెట్టగల స్తోమత ఉందంటేనే…వ్యాక్సిన్‌ గురించి మాట్లాడుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యాంటీ వైరల్ డ్రగ్ దందా మొత్తం ఆర్‌ఎంపీ వైద్యుల కేంద్రంగానే నడుస్తోంది. ఇందులో ప్రైవేట్ హాస్పటిల్స్ సిబ్బంది నుంచి..ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరికి వాటా ఉంది. ఒక్క డోస్ అసలు ధర రెండు వేలు ఉంటే బ్లాక్ మార్కెట్లో లక్షకు పైనే అమ్ముతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. పలు ఆసుపత్రి యాజమాన్యాలు రెమిడిసివిర్‌ను పేషెంట్స్‌ కోసమంటూ.. లెక్కలు చూపించి బయట బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.

ఇక మరి దారుణం ఏంటంటే ఆస్పత్రి స్టాఫ్ రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఖాళీ చేసి మందు స్థానంలో మినరల్ వాటర్ నింపేసి ఆ డ్రగ్ వేరేవాళ్లకు అమ్ముతూ పట్టుబడుతున్నారు. రెమిడెసివిర్ చివరకు స్మగుల్డ్ గూడ్స్ గా మారింది. ఎవరికన్నా కావలంటే బ్లాక్ మార్కెట్లో కొనాలి. రహస్యంగా వచ్చి డబ్బు తీసుకుని ఇంజక్షన్ ఇచ్చి జారుకుంటున్నారు. అసలు ఈ యాంటి డ్రగ్ వాడోచ్చా లేదా అన్న దాని పై రకరకాల వాదనలు నడుస్తున్నా రోగుల బలహీనతలే పెట్టుబడిగా మూడు పువ్వులు..ఆరు కాయలుగా రెమిడెసివర్ దందా నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here