Home News Updates

ఖబడ్ దార్ టర్కీ

భారత దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దని భారత్ శనివారం టర్కీకి హెచ్చరించింది .. అంతే కాదు పాకిస్తాన్ నుండి వున్న ఉగ్రవాద ముప్పును గుర్తు చేసింది. పాకిస్తాన్ వైపు నుండి భారతదేశం ఎదుర్కుంటున్న ఉగ్రవాదం వల్ల ముప్పును తెలియ చెబుతూ భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ సూచించారు .

అసలు ఇదంతా ఎందుకు వచ్చిన్దంటే ఇస్లామాబాద్‌ పర్యటన కు వెళ్లిన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ కాశ్మీర్‌లోని పరిస్థితిని వివరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితి కనిపిస్తోందని . కాశ్మీర్లో భారతదేశం యొక్క ఇటీవలి చర్యలను “ఏకపక్షంగా” ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయాన్నీ , టర్కీ ., మలేషియా కూడా తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపధ్యం లో భారత్ తాజా హెచ్చరిక అందరికి చెంప పెట్టుగా భావించాల్సి వుంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here