Home Health corona

భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ..ఆందోళనకు గురి చేస్తున్న మరణాలు

భారత్ లో సెకండ్ వేవ్ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. వరుసగా నాలుగవ రోజు రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య అటు ఇటుగా 3 లక్షలు సరాసరి నమోదైంది.పాజిటివ్ కేసులు తగ్గినా ఆగని “కరోనా” మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో గడచిన 24 గంటలలో మొత్తం 2,76,070 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 3,874 మంది మృతి చెందారి. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,69,077 గా ఉంది..

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400 గా ఉంది. ప్రస్థుతం దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 31,29,878గా ఉంది. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,87,122 గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.23 శాతం. ఇది దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.66 శాతంగా ఉంది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 11,66,090 కాగా గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,55,010.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here