తమిళనాడుతో తనకు విడదీయరాని బంధం ఉందని కాంగ్రేస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించిన రాహుల్.. తమిళనాడుకు పూర్వవైభవం తీసుకొచ్చేందకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఈరాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదువలేదన్న ఆయన యావత్ ప్రపంచం తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేస్తానని చెప్పారు.

తమిళనాడుతో నాకు కుటుంబ బాంధవ్యముందని రాహుల్ తెలిపారు. మానాయనమ్మ ఇందిరాగాంధిని మీరంతా ఎంతగానో అభిమానిస్తూ వచ్చారని.. ఆవిధంగానే మీరు నాపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు. రాహుల్ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో తమిళనాడుకు వచ్చారు.