Home News Updates

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు : కెసిఆర్

సీఏఏ పై ..సీఎం కేసీఆర్ సభలో తీవ్ర స్థాయి లో మండి పడ్డారు . గుడ్డిగా మేము వ్యతిరేకించడం లేదని చెబుతూ అన్ని అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నా మని చెప్పారు . ఇది హిందు ముస్లిం సమస్య కాదు దేశ సమస్య అని అయన గట్టిగా చెప్పారు.

” నాకే బర్త్ సర్టిఫికెట్ లేదని చెప్పాను.. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవు.. వాళ్ళ పరిస్థితి ఏంటి .. అని కెసిఆర్ ప్రశ్నించారు ..

” అదేమంటే నిన్ను ఎవరు బర్త్ సెర్టిఫికెట్ అడిగారు అని నన్ను అంటున్నారు..ఒక్క.మాట అడుగుత సమాధానం చెప్తారా..
ఓటర్ ఐడి, ఆధార్ రేషన్ కార్డ్ ఏది కూడా పని చేయదు అంటున్నారు..
దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు వారి పరిస్థితి ఏంది కేంద్రం సమాధానం చెప్పాలి” అని ఆయన నిలదీశారు.

“ఈ దేశానికి ఈ చట్టం అవసరం లేదు..రాక్షసానందం పొందుతూ ఈ ఆక్ట్ అమలు చేయనవసరం లేదు.ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు..” అంటూ అయన చెబుతూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here