Home News Updates

తిరుపతిలో లైట్ మెట్రో! మెట్రో ఎండీతో వైవీఎస్ భేటీ..

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం అమలు కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డితో హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ:

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతీ అతిథి గృహంలో వై వి సుబ్బారెడ్డి గారితో భేటీ అయ్యారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించడం జరిగినది. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చి దిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక కోరిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here