ఈటల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ ఆ పై రాజీనామా ఇలా అన్ని రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్ లో ఉపఎన్నికకు తెరలేచింది. దీనిపై హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపుర్ లో ప్రజల్లో భిన్న స్పందన కనిపిస్తుంది. తెలుగు పాపులర్ టీవీ ప్రజానాడి కార్యక్రమంలో మండల ప్రజలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈటల రాజీనామాతో ఉపఎన్నిక హడావిడి నియోజకవర్గంలో మొదలైంది. అధికార పార్టీనేతల పర్యటనలు ప్రచారం ఆ పై ప్రజల్లో దీని పై పెద్ద చర్చే నడుస్తుంది.