Home News

హుజూరాబాద్ లో ఈటల vs గంగుల వర్గాలుగా ముదిరిన వార్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ మరింత హీట్ ఎక్కింది. మంత్రి వర్గం నుంచి తొలగించిన స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా బలగాలను మొహరిస్తుంది గులాబీ దళం. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో స్థానిక టీఆర్ఎస్ నేతలను ఏకతాటిపైకి తెస్తుంది. మంత్రి ఈటల వైపు వెళ్లిన ప్రజాప్రతినిధులను సైతం వెనుక్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణ వరకు వెళ్లింది.

హుజూరాబాద్ లో మంత్రి గంగుల జోక్యం పై ఫైరవుతున్నారు ఈటల రాజేందర్. గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసిన విధంగా 20 ఏళ్లుగా తన వెంట ఉన్న నాయకులను మంత్రి గంగుల బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అదే సమయంలో ఇల్లందకుంట మడలంలోని ప్రజాప్రతినిధులు ఈటలను కలిసి మద్దతు తెలిపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరి కొందరు నియోజకవర్గ నేతలను కరీంనగర్ రప్పించి ఈటల పై విమర్షలు చేయించారు మంత్రి గంగుల.

నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటిస్తున్న మంత్రి గంగుల వర్గీయులు ఈటల అనుచరులను ఒక్కొక్కరిగా వేరు చేసే పనిలో పడ్డారు. ఈటల రాజీనామా చేసే సమయానికి ఆయనను ఒంటరి చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. మరో పక్క కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డితో సమన్వయం చేసుకుని ఘాటు విమర్షలకు దిగితుంది. మరి వీటన్నింటిని ఎదుర్కొని ఈటల ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here