Home Videos

హుజురాబాద్: వీణవంకలో ఈటలకు ఊహించని రెస్పాన్స్

బీజేపీలో చేరిన ఈటల తొలిసారిగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జమ్మికుంట మండలం నుంచి ప్రారంభమైన ఈటల రోడ్ షో రోజుకో మండలంలో పర్యటిస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో ఈటలకు ఊహించని ఆదరణ లభించింది. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కాగా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళతానని చెప్పిన ఈటల నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here