తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు హుజురాబాద్ నియోజకవర్గం మీద కేంద్రీకృతం అయివున్నాయి . మారిన రాజకీయపరిస్థితిలో అనుహ్యంగా బీజేపీ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజురాబాద్ ఉపఎన్నికకు సవాల్ విసిరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తిరిగి ఎన్నికకకు సిద్దపడుతున్నారు. మరో వైపు అభ్యర్ది ఎంపిక పై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతుంది. దీని పై సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సీఎల్ వెంకట్రావ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.టీఆర్ యస్ నుంచి బరిలో ఎవరు ఉంటారనే విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు . ఇద్దరు ముగ్గురు పరిశీలనలో ఉన్నారని అంటున్నారు . నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను చూసే భాద్యతను సీనియర్ మంత్రి హరీష్ రావు కు అప్పగించారు .ఈటల బీజేపీ లో చేరతారని ఊహించని టీఆర్ యస్ అధినేత కేసీఆర్ అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కంగు తిన్నారు. ఈటల కూడా ఇంత తొందరగా బీజేపీ లోకి వెళతారని రాజకీయపరిశీలకులు సైతం ఊహించలేదు.