Home Videos

పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి..ఎలాంటి చికిత్స అందించాలి

చిన్నారుల్లో వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి.. ఎలాంటి చికిత్స అందించాలన్న దాని పై సీనియర్ డా.సీఎల్ వెంకట్రావ్ మరిన్ని వివారలు తెలిపారు. మెజార్టీ పిల్లల్లో కరోనా సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు ఉండట్లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు కన్పిస్తున్నాయని. సాధారణంగా మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. అయితే రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం కొంత చికిత్స అవసరమన్నారు.

ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి లక్షణాలుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి ఉన్నా వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here