Home Videos

డీఆర్డీవో 2 DG డ్రగ్ కరోనా పై ఎలా పని చేస్తుందంటే…!

కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో. ఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ డ్రగ్‌ అత్యవసర వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మందు పొడి రూపంలో వాటర్ తో తీసుకోగానే వైరస్ ప్రభావిత కణాలను నాశనం చేస్తుంది. ఆక్సిజన్ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు స్పీడ్‌గా రికవరీ కావడానికి ఈ డ్రగ్ సహాయ పడనుంది. శరీరంలో ఇది వైరస్ సెల్స్ మీద నేరుగా పనిచేస్తుంది.

2 DG డ్రగ్ అనేది ఒక ఆత్మహుతి దళంలా పని చేస్తుందని కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్ విశ్లేషించారు. ఆక్సీజన్ అవసరాన్ని తగ్గించేలా చేసి శరీరంలో ఆక్సీజన్ సెల్స్ పడిపోకుండా చేస్తుంది. డా.రెడ్డీస్ ల్యాబ్ సౌజన్యంతో ఇది పని చేస్తుంది. మొదటి విడత 10వేల ప్యాకెట్లు విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here