కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇండియాలో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో కొవిడ్ రోగులు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ సోకిన వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాస సమస్యలను అధిగమించవచ్చు. శ్వాసతో పాటు ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్,కరోనా స్పెషలిస్ట్ డా.ముఖర్జీ.
ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ చేరుతుందని సూచిస్తున్నరు డా.ముఖర్జీ. ఆక్సిజన్ స్థాయిలు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలో పల్స్ ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసుకుని చిన్న చిన్న పద్దతుల ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.