Home Entertainment Cinema

హిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవి ..

విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాతగా కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా హిట్. ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కొన్ని వర్గాలకు మాత్రమే నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన హిట్ సినిమాకు వసూలు కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా దాదాపు దాదాపు 4 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. నాని ఇమేజ్ కూడా పని చేయడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే వీకెండ్ కాబట్టి వసూళ్లు బాగానే వచ్చాయి.. ఈ సినిమాకు అసలైన పరీక్ష సోమవారం నుంచి మొదలు కానుంది. వీక్ డేస్ మొదలైన తర్వాత కలెక్షన్లు ఎలా వస్తున్నాయి అనే దానిపైనే హిట్ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. నాలుగో రోజు కలెక్షన్లు పడిపోకపోతే అప్పుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయినట్లు.. లేదంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్లకు ఎంతోకొంత నష్టాలు తప్పవు.

5 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 80 శాతం రికవరీ చేసింది. మిగిలిన వసూళ్ల కోసం బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈయన నటించిన గత సినిమా ఫలక్నామా దాస్ కూడా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు హిట్ సినిమా కూడా చూస్తుంటే అదే కోవలోకి వెళ్లేలా కనిపిస్తుంది. సినిమా బాగానే ఉన్నా రెగ్యులర్ ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. అందుకే కలెక్షన్లు ఊహించనంతగా రావడం లేదు. ఏదేమైనా కూడా నిర్మాతగా నాని మాత్రం వరుసగా రెండోసారి సక్సెస్ అయ్యాడు. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది హిట్ సినిమా సీక్వెల్ కూడా తీయబోతున్నాడు నాని. ఈలోపు ఏదైనా మంచి కథ వస్తే మరో సినిమా కూడా నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు నాచురల్ స్టార్. అయితే తన బ్యానర్ లో తాను హీరోగా మాత్రం సినిమా చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here