
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రధాని బోస్కి ఘన నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కొల్ కత్తాలో జరుగుతున్న పరాక్రమ దివాస్ కార్యక్రమానికి మోది హజరయ్యారు. విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించిన మోదీ నేతాజీ స్మృతి పథానికి అంజలి ఘటించారు. అనంతరం బోస్ జీవితానికి సంబంధించిన సన్నివేశాలు కనులారా చూశారు.


సుభాష్ చంద్రబోస్ ధైర్యం, తన పరాక్రమము యావద్ దేశానికి స్పూర్తినిస్తాయని ప్రధాని అన్నారు. బోస్ చేసిన అసమాన సాహసాలు చెరిగిపోనివని గుర్తుచేశారు. అదేవిధంగా నేషనల్ లైబ్రరీలో అంతర్జాతీయ డిలిగేట్లు, కళాకారులను మోదీ కలిశారు. భారత ప్రభుత్వం బోస్ జయంతిని పరాక్రమ దివాస్‌గా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా పరాక్రమ దివాస్ వేడుకలు జరుపుకుంటున్నారు.