Home Health corona

బ్రేకింగ్: తెలంగాణలో కరోనా కేసులు,లాక్ డౌన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగియనుంది. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకూ తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటూ ప్రశించింది హైకోర్టు. పెరుగుతున్న కరోనా కేసులు,ఆస్పత్రుల దోపిడి పై ఇప్పటికే తెలంగాణ సర్కార్ ని తీవ్రంగా మందలించింది. రేపటితో కర్ఫ్యూ ముగియనుండటంతో తదుపరి చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా.. ఆకాశంలోనా అంటు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు తదుపరి చర్యల్పై ప్రశ్నించడంతో రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరిగి పరిస్థితి చేదాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గతంలోనే వివరణ కోరింది హైకోర్టు. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతానని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని నిలదీసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు ఫైర్ అయింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదన్న హైకోర్టు.. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here