Home News Updates

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు..! ఏంటో తెలుసా?

తాజాగా మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని రికార్డులను సీబీఐకు వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది.

వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి తమకు రికార్డులు ఇవ్వాలని సీబీఐ అధికారులు పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదని మెజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది.

దీంతో ఈ కేసుకు సంబంధించి రికార్డులను తమకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు.

ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకు అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌కు హైకోర్టు సూచించింది.

అయితే ఈ కేసు విచారణ చేపట్టిన బృందంలో చాలా మంది అధికారులు కరోనా బారిన పడడంతో కొద్ది రోజులుగా కేసు విచారణకు బ్రేక్ పడింది.

అయితే ఇప్పుడిప్పుడే అధికారులు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో సీబీఐ ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here