Home News Stories

ఆకాశం నీ హద్దు…అవకాశం వదలొద్దు..

ఓ ఆలోచన జీవితాన్నే మార్చేస్తోంది. పట్టుదల అంతిమంగా గమ్యానికి చేరుస్తుంది. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంటోంది ఆకాశం నీ హద్దురా. కోవిడ్ దెబ్బకు థియేటర్లు అందుబాటులో లేవుగానీ, లేకపోతే హౌస్?ఫుల్ కలెక్షన్స్ సృష్టించేంత దమ్ముంది ఈ సిన్మాలో. ఓటీటీ ప్లాట్.ఫాంపైనే అందరి మనసులూ గెలుచుకుని వన్స్ మోర్ అనిపిస్తోంది సూర్య యాక్టింగ్.కి ఆకాశమే హద్దని చాటిన సిన్మా. నో డౌట్. సూర్య కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికేం లేదు. అతను ఇదివరకే ఎన్నో సిన్మాల్లో తానేంటో చూపించాడు. సింఘంలా పంజా విసిరాడు. గజినీ తర్వాత తెలుగులో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్.ని తన సొంతం చేసుకున్నాడు తమిళ హీరో సూర్య. అయితే కొన్నాళ్లుగా వస్తున్న సిన్మాలు పెద్దగా క్లిక్ కాకపోవటంతో తెలుగులో సూర్య మార్కెట్ డౌన్ అయ్యింది. సెవెన్త్ సెన్స్, ట్వంటీ పోర్ లాంటి సిన్మాలు బాగున్నాయనే టాక్ వచ్చినా కమర్షియల్.గా హిట్ కాలేదు. అవి కేవలం క్లాసికల్ మూవీస్.గానే మిగిలిపోయాయి. ఈ మధ్య వచ్చిన NGK అయితే సూర్య మార్కెట్.ని బాగా దెబ్బతీసింది. సూర్య సిన్మాలకు టాలీవుడ్.లో క్రేజ్ తగ్గిపోయిందనుకున్న టైంలో…ఒక్కసారిగా అతన్ని అమాంతం లేపేసింది ఆకాశం నీ హద్దురా.

తెలుగు ఇండస్ట్రీలో సూర్యకు మళ్లీ లైఫ్ ఇచ్చింది ఆకాశం నీ హద్దురా సిన్మా. కరోనా దెబ్బకు డల్ అయిపోయిన ఎంటర్.టైన్మెంట్ రంగానికి మళ్లీ బూస్టప్ ఇచ్చింది. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. డెక్కన్ ఎయిర్.వేస్ అధినేత గోపీనాథ్ సక్సెస్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సిన్మా ఇది. స్వయానా గోపీనాథే చెప్పినట్లు ఫిక్షన్ ఎక్కువగా ఉన్నా ఇంత క్రిటికల్ సబ్జెక్ట్.లో భావోద్వేగాలను మాత్రం పూర్తిస్థాయిలో పండించగలిగారు. మాస్ టూ క్లాస్ అందరికీ నచ్చేలా సిన్మా తీయడమంటే మాటలు కాదు. దానికెంతో క్రియేటివిటీ కావాలి. తన కలను నెరవేర్చుకునేందుకు తపన పడే యువకుడిగా, తన లక్ష్యం కోసం కుటుంబాన్నే ఫణంగా పెట్టిన మధ్యతరగతి మనిషిగా సూర్య యాక్షన్ సుపర్బ్ అని కితాబిస్తున్నారు క్రిటిక్స్. ఈ సినిమా సక్సెస్.తో సూర్య ఈజ్ బ్యాక్ అంటూ ఎనలైజ్ చేస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు. ఎప్పుడో వచ్చిన గజినీ తర్వాత సూర్యకు మళ్లీ ఆకాశం నీ హద్దురానే బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని అంతా సర్టిఫై చేస్తున్నారు. టైటిల్.కి తగ్గట్లే ఇక సూర్య కెరీర్.కి స్కై ఈజ్ ద లిమిట్ అంటున్నారు. ఈ సక్సెస్.తో మళ్లీ తెలుగులో సూర్య మార్కెట్ డబల్ అయ్యేలా ఉంది. వరస ఫ్లాపులకు తిరుగులేని హిట్.తో జవాబిచ్చాడు సూర్య.

క్రియేటివ్ డైరెక్టర్.గా పేరు తెచ్చుకున్న సుధా కొంగరకు టాలీవుడ్.లో కొత్త ఆఫర్లు ఇవ్వబోతోంది ఆకాశం నీ హద్దురా మూవీ. కోలీవుడ్.లో ఇప్పటికే తన మార్కు వేసుకున్న సుధా కొంగర….తెలుగునాట గుర్తింపు ఉన్న డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. పదమూడేళ్లక్రితమే నష్టాలతో నడపలేక కింగ్ ఫిషర్ ఎయిర్.వేస్.కి అమ్మేసిన ఎయిర్ డెక్కన్ సబ్జెక్ట్.తో సిన్మా తీయడమే ఓ సాహసం. ఆ సక్సెస్ స్టోరీ సుదీర్ఘకాలం సాగలేదని తెలిసినా, వర్తమానంలో కళ్లెదుట కనిపించకపోయినా దాన్ని భావోద్వేగా సిన్మాగా మలిచిన తీరు మాత్ర అద్భుతం. అయితే అప్పట్లో ఎయిర్ డెక్కన్ జైత్రయాత్రను ఈ కాలానికి పరిచయం చేసి స్ఫూర్తిని నింపింది సూర్య మూవీ.

2007 నాటికి రోజుకు 67 విమానాల నుంచి 380 విమానాలను నడిపే సంస్థగా ఎదిగింది ఎయిర్ డెక్కన్. చిన్న చిన్న పట్టణాల మధ్య ఫ్లైట్ సర్వీసులతో విమానయానాన్ని సామాన్యులకు చేరువచేసింది. కేవలం ఒకే రూపాయి టికెట్.తో 30 లక్షల మంది విమాన ప్రయాణ కలను నిజం చేసింది. అయితే క్రమేణా నష్టాలు పెరుగుతూ… నిర్వహణ భారంగా మారిపోవటంతో 2007లో ఎయిర్ డెక్కన్.ని విజయ్ మాల్యాకి అమ్మేశారు గోపీనాథ్. విజయ మాల్యా దాని పేరు మార్చి కింగ్‌ఫిషర్ రెడ్.గా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. చివరికి 2011లో మాల్యా కూడా ఆ విమాన సంస్థను మూసేశారు. ఇదీ చరిత్ర. అయితే 2007కంటే ముందు సాగిన గోపీనాథ్ సక్సెస్ ఎలిమెంట్.నే అద్భుత దృశ్యకావ్యంగా మలుచుకోగలిగింది ఆకాశం నీ హద్దురా టీం. ఎయిర్ డెక్కన్ ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆ స్ఫూర్తి ఇప్పటికీ సజీవం. ఆకాశమే హద్దుగా ఎదగాలనుకునే కోట్లమందికి స్ఫూర్తిదాయకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here