Home News

తమిళనాడులో నటుడు సిద్థార్థ వర్సెస్ బీజేపీ

తమిళనాడులో నటుడు సిద్థార్థ-బీజేపీ నేతల మధ్య రగడ కొనసాగుతోంది. కరోనాను కంట్రోల్ చేయటంలో కేంద్రం వైఫల్యం చెందిందని ఇటీవల కామెంట్లు చేశారు సిద్థార్థ. సిద్ధార్థకు కౌంటర్ ఇచ్చారు తమిళనాడు బీజేపీ నేతలు. 24 గంటల్లో తనకు 5 వందలకు పైగా వార్నింగ్ ఫొన్స్ వచ్చాయని సిద్ధార్థ ట్వీట్స్‌ చేశారు. తన ఫోన్ నెంబర్‌ను తమిళనాడు ఐటీ శాఖ లీక్ చేసిందని ఆరోపించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ను రికార్డ్ చేశామన్నారు సిద్ధార్థ్‌.

ఐతే…సిద్ధార్థకు నటి శ్రియా ధన్వంతరి మద్ధతు ప్రకటించారు. సెలబ్రిటీలను నీచంగా వేధించేవారిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు. గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఐదు వందలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని, తనను చంపుతామని, రేప్ చేస్తామని, అమర్యాదకరంగా మాట్లాడారని సిద్ధార్థ తెలిపాడు. ఎంత బెదిరించినా తన నోరు మూయలేరని హెచ్చరించాడు. తనను ఫోన్ లో దూషించిన వారి కాల్స్ రికార్డ్ చేశానని, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారి డీపీలను కాపీ చేశానని వీరిపై పోలీసు కంప్లైట్ ఇస్తున్నానని సిద్ధార్థ తెలిపాడు. అంతేకాదు… ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశాడు. మొత్తానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలీవానగా మారేట్టుగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here