Home Entertainment Cinema

రెడ్ టీజర్.. రామ్ పోతినేని డబుల్ డోస్ అదిరింది..

Hero Ram Pothineni Red Teaser Review

కెరీర్ ఫ్లాపుల్లో ఉన్నపుడు ఒక్క హిట్ చాలు మళ్లీ పుంజుకోడానికి. హీరో రామ్ విషయంలో కూడా ఇస్మార్ట్ శంకర్ ఇదే చేసింది. అప్పటి వరకు చాలా ఫ్లాపులు చూస్తున్న ఈ హీరోకు ఒక్కసారిగా వెయ్యేనుగుల బలాన్నిచ్చింది ఇస్మార్ట్ శంకర్. తొలి రోజు నుంచే మాస్ ఏరియాల్లో రప్ఫాడించింది ఈ చిత్రం. అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమా రెడ్. తనతో రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమలనే ఈ చిత్రానికి దర్శకుడిగా తీసుకున్నాడు రామ్. రెడ్ సినిమా టీజర్ ఇప్పుడు విడుదలైంది. తమిళనాట మంచి విజయం సాధించిన తడమ్ సినిమాకు ఇది రీమేక్. ఫీల్ గుడ్ సినిమాల నుంచి పూర్తిగా యు టర్న్ తీసుకున్నాడు రామ్. గతేడాది ఇస్మార్ట్ శంకర్.. ఇప్పుడు రెడ్ అంటూ పక్కా మాస్ దారిలోకి వెళ్లిపోతున్నాడు ఈ కుర్ర హీరో.

పైగా ఈయన ఎనర్జికి ఇలాంటి కారెక్టర్స్ బాగా సూట్ అవుతున్నాయి కూడా. అందుకే పంథా మార్చేసాడు ఈయన. కచ్చితంగా రెడ్ సినిమాతో కూడా సంచలన విజయం అందుకుంటానని చెబుతున్నాడు ఈ హీరో. రెడ్ టీజర్ చూసిన తర్వాత రామ్‌ మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తుంది ఈ చిత్రం. రామ్ కెరీర్‌లో తొలిసారి ఇలాంటి సినిమా ట్రై చేస్తున్నాడు. తడమ్ సినిమాలో లైన్ మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథను కాస్త మార్చి తీస్తున్నాడు కిషోర్ తిరుమల.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఎప్రిల్ 9న సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ సినిమాతో ఏం మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here