Home Entertainment Cinema

బాలీవుడ్ లో ప్రభాస్ కు ప్రతిష్టాత్మక అవార్డు..

ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు.. బాహుబలి సినిమా తర్వాత ఈయన రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఇది తెలుగులో అంచనాలు అందుకోకపోయినా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం సాహో సినిమా బాగానే నచ్చింది. అక్కడ ప్రేక్షకులు ప్రభాస్ తమ సొంత హీరోలా ఓన్ చేసుకొన్నారు. కేవలం హిందీలోనే సాహో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో సుజీత్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాడు. అయితే తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా వెనకబడింది. ఇదిలా ఉంటే సాహో సినిమాకు గాను ప్రభాస్ ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్నాడు.

బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. 2019 ఆగస్టు 30న విడుదల అయిన సాహో బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. తొలి రోజు నుంచే అక్కడ వసూళ్ళ సునామీ క్రియేట్ చేసింది సాహో. బాహుబలి సినిమాతోనే బాలీవుడ్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో అంటూ వాళ్లను నేరుగా పలకరించాడు. ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఈ ఏడాది జనవరి 27న జపాన్ లో కూడా సాహో సినిమా విడుదలైంది. ప్రభాస్, శ్రద్ధ కపూర్ ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లి వచ్చారు. ఏదేమైనా కూడా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ సాహో ప్రభాస్ కు మాత్రం బాగానే హెల్ప్ చేసింది. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ప్రభాస్ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here