Home News

బీజేపీ అష్టదిగ్భాందాన్ని చేధించిన మమత..బెంగాల్ లో హ్యాట్రిక్ విక్టరీ

మోడీ, షా ద్వయ వ్యూహాన్ని బద్దలు కొట్టింది మమత బెనర్జీ. అమిత్ షా కాలు పెడితే చాలు ఆ రాష్ట్రం కమలం ఖాతాలోకి పోతుందన్న సెంటిమెంట్‌ను తునాతునకలు చేసింది. ఒక నాడు కమ్యూనిస్టుల కంచుకోటను కూకటివేళ్లతో పెకిలించిన నిప్పుకణం మమత బెనర్జీ నేడు కాషాయ కూటమికి ఊహంచని షాక్‌ ఇచ్చింది. బెంగాల్‌ గడ్డ మూడోసారి కూడా తనదే అని కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బెంగాల్ ఫైటర్ మమత బెనర్జీ.

మమత బెనర్జీని బెంగాలీలు ఆప్యాయంగా దీదీ అని పిలుస్తారు. మొండి తనానికి, ముక్కసూటి తత్వానికీ కేరాఫ్ అడ్రస్‌ మమతా బెనర్జీ. అమిత్‌షా రాజకీయ చదరంగంలో చిక్కుకొని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను కోల్పోతున్న సమయంలో ఆ గాలికి ఎదురొడ్డి అధికారాన్ని నిలబెట్టుకుంది బెంగాల్ టైగర్. 1970 దశకంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ అనతి కాలంలోనే రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. బెంగాల్‌ను ఏలిన వామపక్ష కూటమిని గడగడలాడించి ఫైర్‌ బ్రాండ్ అని పేరు తెచ్చుకుంది. ఆమెకు కొంత సమయం పట్టినప్పటికీ చివరకు విజయం సాధించారు.

ఇక సవాళ్ల రాజకీయంతో నందిగ్రామ్‌ పోటీ రసవత్తరంగా మారింది. 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపులో అందరి దృష్టి నందిగ్రామ్‌ మీదే ఉంది. నందిగ్రాంలో నామినేషన్ సమయంలో దీదీకి గాయం కావడంతో వీల్‌చైర్‌ పైనే రాష్ట్రం చుట్టేసింది. ఇక ప్రశాంత్ కిశోర్ వ్యూహలు కూడా టీఎంసీకి ప్లస్ అయ్యాయి. సువేందుపై రివేంజ్‌కి మమత ఆయనపైనే పోటీకి దిగడం సంచలమైంది. చివరి వరకు విజయం దోబుచులాడిన మమత స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here