Home News Stories

పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దు: హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన టి ఆర్ ఎస్ కార్యకర్త స్వామి నిన్న రాత్రి టి ఆర్ ఎస్ పార్టీ ఓటమి కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు..

  • స్వామి మృత దేహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించిన మంత్రి హరీష్ రావు గారు..
  • అంతక్రియాల్లో పాల్గొని పాడే మోసిన మంత్రి హరీష్ రావు గారు..
  • ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..
  • రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం..
  • ఓటమి కి ఆత్మహత్యలు పరిష్కారం కావు.. ఆత్మవిశ్వాసం తో ముందుకు పోదాం..
  • కార్యకర్తలు అందరూ సంయమనం తో ఉండాలి.సహనం కోల్పోవద్దు..
  • ధైర్యం తో ముందుకు పోదాం..
  • టి ఆర్ ఎస్ కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను,దుఃఖ పడ్డాము…
  • కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దు..
  • టీఆరెస్ పార్టీ కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుంది ..
  • మేము అందరం మీకు అండగా ఉంటాము..
  • రాజకీయం లో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి.. కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నాను..
  • స్వామి చాలా చురుకైన కార్యకర్త
    మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడు
    రాత్రి బవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త ..
  • స్వామి కుటుంబానికి టీఆరెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది..
    అండగా ఉంటుంది…
  • ఈ రోజు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాము.. భవిష్యత్తు లో కూడా స్వామి కుటుంబానికి టీ ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుంది..
  • కార్యకర్తలు అందరూ కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోవద్దు.. మనో నిబ్బరం తో ఉండండి.. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది..
  • స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిపిస్తాము
    విద్య ను అందిస్తాము..
  • స్వామి భార్యకు ,పిల్లలకు వారి కుటుంబానికి అండగా ఉంటాము
    టీఆరెస్ పార్టీ కి ఎంతో భవిష్యత్ ఉన్నది.. ఎన్నో ఎన్నికల్లో గెలిచాము
    కొన్ని సందర్భాలలో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది..
  • ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ..
  • స్వామి కుటుంబానికి పార్టీ పక్షాన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పక్షాన సంతాపం వ్యక్తం తెలియ చేస్తున్నాం
    పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడికి వచ్చాము.. సహాయం అందించాము.. అండగా ఉంటాము..
  • ఎవ్వరు ఆందోళన చెంద వద్దు
    గెలిచినప్పుడు పొంగిపోవద్దు
    ఒడినప్పుడు కుంగిపోకూడదు..స్పోర్టివ్ గా తీసుకోవాలి .. సహజంగా తీసుకోవాలి
  • లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందాం
    సమన్వయం తో ముందుకు వెళ్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here