Home Entertainment Cinema

హ్యాపీ బర్త్ డే టూ నేచురల్ స్టార్ నాని.. Happy Birth Day Nani

ఘంటా న‌వీన్ బాబు.. ఒక‌వేళ హీరో కాక‌పోయుంటే ఇప్పుడు అంద‌రూ అత‌న్ని ఇలాగే పిలిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అత‌న్ని ముద్దు ముద్దుగా నాని అని పిలుచుకుంటున్నారు. అత‌డే మ‌న న్యాచుర‌ల్ స్టార్ నాని. ఫిబ్రవరి 24న ఈయన పుట్టిన రోజు. 35 వసంతాలు పూర్తి చేసుకుని 36వ ఏట అడుగు పెడుతున్నాడు నాని. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే 12 ఏళ్లైపోయింది. అష్టాచ‌మ్మాతో హీరో అయిన నాని.. ఆ తర్వాత ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఎంతో మ్యాజిక్ చేసాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి.. ఆ తర్వాత రేడియో జాకీగా మారి.. నటుడిగా ఎదిగి.. స్టార్ గా నిలిచాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చూపిస్తున్నాడు.

Hero Nani Birth Day February 24

కాలం ఇంత వేగంగా వెళ్తుంద‌ని ఎవ‌రూ అనుకోరు.. కానీ వెళ్లింది. అష్టాచ‌మ్మా సెప్టెంబ‌ర్ 5, 2008న విడుద‌లైంది. అంతా కొత్త వాళ్ళ‌తో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసిన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప తెలిసిన మొహం ఒక్క‌టి కూడా ఆ సినిమాలో క‌నిపించ‌దు. అలాంటి సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించాడు నాని. ఆ త‌ర్వాత రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. హీరో కాక‌ముందు శీనువైట్ల ద‌గ్గ‌ర ఢీ.. బాపు గారి ద‌గ్గ‌ర రాధాగోపాలం సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసాడు నాని. ఓ సినిమా ఎడిటింగ్ కోసం ఎడిట్ రూమ్ కు వ‌చ్చిన నానిలో హీరోను చూసాడు ఇంద్ర‌గంటి. అలా మ‌నోడి ప్ర‌యాణం మొద‌లైంది. 2011లో వ‌ర‌స‌గా అలా మొద‌లైంది.. పిల్ల‌జ‌మీందార్ లాంటి హిట్ల‌తో నాని క్రేజ్ తెచ్చుకున్నాడు.

2012లో రాజ‌మౌళి ఈగ‌తో నేష‌న‌ల్ వైడ్ గా స్టార్ అయిపోయాడు. అయితే వెంట‌నే గౌత‌మ్ మీన‌న్ ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. కృష్ణ‌వంశీ పైసా.. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ తొలి తెలుగు సినిమా ఆహాక‌ళ్యాణం.. స‌ముద్ర‌ఖ‌ని జెండా పై క‌పిరాజు ఇలా వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపులు వ‌చ్చాయి. అయ్యో పాపం అనుకుంటున్న త‌రుణంలో వ‌చ్చిన సినిమా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం. 2015, మార్చ్ 21న వ‌చ్చిన ఈ చిత్రం త‌ర్వాత నాని స్టార్ అయిపోయాడు. భ‌లేభ‌లే మ‌గాడివోయ్.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ.. జెంటిల్ మ‌న్.. మ‌జ్ను.. నేనులోక‌ల్.. నిన్నుకోరి.. ఎంసిఏ వ‌ర‌కు ఈయ‌న జైత్ర‌యాత్ర సాగింది. 10 నుంచి 40 కోట్లకు మార్కెట్ పెంచుకున్నాడు.
కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా జెర్సీ సినిమాతో తనెంత గొప్ప నటుడిని అనేది మరోసారి నిరూపించుకున్నాడు నేచురల్ స్టార్. ఈ చిత్రం తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాతో మరోసారి ఫ్లాప్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వి అంటూ తన 25వ సినిమాతో వచ్చేస్తున్నాడు ఈయన. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు నాని. ఇంద్రగంటి దర్శకుడు. ఇక హిట్ అనే సినిమాను నిర్మించాడు. ఇది మరో వారంలో విడుదల కానుంది. ఇక బర్త్ డే సందర్భంగా మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టేసాడు నాని. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకుడు. నిన్ను కోరి తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here