Home Entertainment Cinema

కరోనాతో నెలరోజులు ఆస్పత్రి పాలైన గ్లామర్ బ్యూటీ

గ్లామర్ బ్యూటీ హంస నందిని కరోనాతో నెలరోజులు పైగా ఆస్పత్రి పాలయ్యా అని తెలిపింది.తరచూ తనకు సంబంధించిన వీడియోలు, హాట్‌ హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌ ఉండే ఆమె కొద్ది రోజులుగా ఒక్క పోస్టు షేర్‌ చేయలేదు. దీంతో హంసకు ఏమైందంటు ఫాలోవర్స్‌ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తాను, తన కుటుంబ సభ్యులంతా కరోనా పాజిటివ్‌గా తేలిందని, 25 రోజుల పాటు కోవిడ్‌ హాస్పిటల్‌నే ఉన్నట్లు నెటిజన్లు పెట్టిన మెసేజ్‌లకు ఆమె సమధానం ఇచ్చారు.

ఏప్రిల్ 9న నేను క‌రోనా బారిన ప‌డ్డాను అన్న హంస నా కుటుంబం కూడా మహమ్మారి బారిన పడింది. దీంతో దాదాపు 30 రోజుల పాటు కరోనాతో పోరాడం. తిరిగి ఇంటికి వస్తామన్న హోప్‌ కూడా పోయాయి. అయితే క‌రోనా అని తెలియాగానే నేను నా ఫ్యామిలీ వెంటనే ఆసుప‌త్రిలో చేరాము. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఇక 25 రోజుల తర్వాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చింది, ఇప్పుడిప్పుడే వారంతా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి’ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here