Home News Politics

గుంటూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్ధులు వీరే ? క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ కే సై అంటున్న వైసీపీ…!

కోస్తా నడిభోడ్డున ఆ కీలక సామాజిక వర్గాన్నే కేంద్రంగా చేసుకుని ఎంపీ అభ్యర్ధులను రంగంలో దించేపనిలో పడింది ప్రతిపక్ష వైసీపీ. ఇప్పటివరకు జిల్లా పార్లమెంట్ అభ్యర్ధుల పై ఉన్న కన్ ఫ్యూజన్ స్థానంలో క్లారిటీకి వచ్చేసింది. సామాజిక వర్గాలవారీగా ఓటర్లను మచ్చిక చేసుకుని అసెంబ్లీ సెగ్మెంట్లవారిగా గెలుపు గుర్రాలను రెడీచేస్తుంది.

అత్యంత ప్రతిష్టాత్మకమయిన రాజధాని జిల్లా గుంటూరులో పార్లమెంట్ అభర్ధులపై క్లారిటికి వచ్చింది వైసీపీ. గుంటూరు పార్లమెంట్ కు మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చిల్లీస్‌ మార్చంట్‌ అధినేత కిలారి రోశయ్య, నరసరావుపేట పార్లమెంట్ స్దానానికి లావు శ్రీకృష్ణదేవరాయులను సిద్దం చేశారు. అంతకు ముందు గుంటూరు పార్లమెంట్ స్దానానికి ఇన్ చార్జ్ గా ఉన్న లావు శ్రీకృష్ణదేరాయులను సామాజికవర్గ సమీకరణలో భాగంగా నరసరావుపేటకు పంపారు. అదే సమయంలో గుంటూరుకు కిలారి రోశయ్యను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ల శాతం అదికంగా ఉండటంతో పాటుగా నరసరావుపేటలో రాయపాటి వారసులను దీటుగా ఎదుర్కోనేందుకు లావు శ్రీకృష్ణదేవరాయులును ఎంపిక చేసి పంపినట్లుగా పార్టి వర్గాల నుంచి సమాచారం వస్తుంది.

ఇక కులాల వారీగా అభ్యర్దుల ఎంపికకు వైసీపీ అధినేత సిద్దం అయ్యారు. 2014 ఎన్నికల్ల్లో నరసరావుపేట నుండి అయోద్య రామిరెడ్డి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయగా ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు..ఇందుకు ప్రధాన కారణం కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకేనని వైసీపీ నాయకత్వం భావిస్తోంది..దీన్ని పరిగణలోకి తీసుకుని కొంత ఇంచార్జుల విషయంలో మార్పులు చేసింది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా అభ్యర్ధుల విషయంలోనూ పార్లమెంట్ ఇంచార్జులకే ఫుల్ పవర్స్ ఇచ్చే యోచనలో ఉంది వైసీపీ పార్టీ అధిష్టానం. అభ్యర్ధుల పేర్ల మీద చేసిన సర్వేలు,వాటి రిపోర్టులు ఆదారంగా ఆశావహుల జాబితాను ఎంపీ అభ్యర్ధుల ముందు ఉంచి మార్పులు చేర్పులు గురించి చర్చించుకోవాలని సూచించింది..

ఇక ఎంపీలు ఇప్పటికే పార్లమెంట్ స్దానాల్లో పనులు మెదలుపెట్టుకున్నారు .రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో మార్పులు,చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ అభర్ధుల ద్వారానే అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో ఒక క్లారిటికి వస్తే అసమ్మతికి చెక్ పెట్టేందుకు వీలుంటుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టి ప్రభావం కూడ బాగా ఉందని వైసీపీ సర్వేలో వెల్లడయింది. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోశయ్యను ఎంపీ అభర్ధిగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే కిలారి రోశయ్య పై కొంత అసంతృప్తి ఉంది..ఆర్దికంగా బలంగా ఉన్నప్పటికి పార్టీ విషయంలో పట్టు లేకపోవడం క్యాడర్ ని గందరగోళంలో పడేస్తుంది. సామాజికవర్గాల సమీకరణకు ప్రాదాన్యత ఇస్తున్న నేపథ్యంలో కిలారికి బెర్త్ కన్ ఫామ్ చేసింది వైసీపీ.

ఇక అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో కొంత క్లారిటికి వచ్చింది ఫ్యాన్ పార్టీ. మంగ‌ళ‌గిరి నుంచి ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, స‌త్తెన‌ప‌ల్లి నుంచి అంబ‌టిరాంబాబు,మాచ‌ర్ల‌ నుంచి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ,గుర‌జాల‌ నుంచి కాసు మ‌హేష్ రెడ్డి, న‌ర్సారావుపేట‌ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, బాప‌ట్ల‌ నుంచి కోన ర‌ఘుప‌తి, ప్రత్తిపాడు నుంచి సుచరిత కి తిరిగి చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. చిలకలూరిపేటలో ఓ ఎన్ఆర్ఐ హడావిడి చేస్తున్నప్పటికి మర్రి రాజశేఖర్ కే టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. పెద కూరపాడు,వినుకొండ,తెనాలి,వేమురు విషయంలో ఓ క్లారిటికి రావల్సి ఉంది.
మొత్తం మీద రాజధాని జిల్లాల్లో క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ కే వైసీపీ మొగ్గు చూపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here