Home News Politics

కంచుకోటలో అభ్యర్ది పై డిఫెన్స్ లో పడ్డ టీడీపీ…?

ఎన్నికల డేట్ ఫిక్స్ అయ్యాయి … ప్రచారాలు జరిగిపోతున్నాయి … కాని తెలుగు తమ్ముళ్ళకు మాత్రం సీట్ ఫిక్స్ అవ్వలేదు . . గతంలో 25వేలకు పైగా మెజార్టితో గెలిచిన సీటు కావటంతో ఈ సారి కూడ గెలుపు పై ఆశలు పెట్టుకున్న -నేతలు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు…. సీటు పై క్లారిటి లేకపోయినా ప్రచారాలు మాత్రం చేసేసుకుంటున్నారు… ఇంతకీ ఆ సీటు ఏదో అకథేంటోచూడండి…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ కోసం తెలుగు దేశం నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు… రిజర్వేషన్‌ సమస్య లేని ఒసీ సీటు కావటంతో రెండు కీలక సామాజికవర్గాలకు చెందిన నేతలతో పాటు.. బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా వెస్ట్‌ సీటుపైనే పైనే ఆశలు పెట్టుకుని ఎవరి లాబీయింగ్‌ వారు చేసుకుంటున్నారు … ఇప్పటికే ఆ సెగ్మెంట్‌కు ప్రధాన ప్రతిపక్షం వైసిపి అభ్యర్దిని డిసైడ్ చేసింది .. ప్రచారంలో కూడా జోరు పెంచింది. జనసేన కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్దిని ప్రకటించి… ప్రచారం ముమ్మరం చేస్తోంది.. అయితే టీడీపీ మాత్రం అభ్యర్ది పై ఇంత వరకు ఒక క్లారిటికి రాలేదు ..

ఇప్పటి వరకు అక్కడ అధికారపక్ష శాసన సభ్యుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి ప్రస్తుతం వైసిపి తీర్దం పుచ్చుకున్నారు… పార్టీ నుంచి జంప్ అయ్యేది ఫిక్స్ అయినప్పటికి మోదుగుల చాలా ఆలస్యంగా పార్టిని వీడారు .. టీడీపీకి అది కూడ మైనస్ గా మారింది .. మోదుగుల స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్ధిపై తెలుగుదేశం దృష్టి పెట్టలేదు.అదీకాక గుంటూరు పశ్చిమంలో పొలిటికల్, క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌కి .. తూర్పు నియోజకవర్గ పరిస్థితులకి లింక్‌ ఉండటం కూడా టిడిపి నిర్ణయంలో జాప్యానికి కారణంగా కనిపిస్తోంది.. తూర్పు టిడిపి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మద్దాలి గిరి పశ్చిమ సీటు కోసం ప్రయత్నిస్తుండటంతో .. కులాల ఈక్వేషన్ లో ఆయనకు సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .. ఎంపీ జయదేవ్ కూడా పశ్చిమంలో మద్దాలి గిరి అభ్యర్ధిత్వానికి మద్దతు ఇస్తున్నారు …

అదలాఉంటే పశ్చిమ సీటు ఆశావహులు సెంటిమెంట్‌ ప్రయోగిస్తూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు .. చంద్రబాబు తిరిగి సీఎం కావాలంటూ నియోజకవర్గంలో పాదయాత్రలతో హడావుడి చేస్తున్నారు … కోవెలమూడి రవీంద్ర తో పాటు… బీసీ నేత బానుబోయిన శ్రీనివాస్‌యాదవ్ పోటా పోటీగా ప్రదర్శనలు నిర్వహిస్తూ .. అటు ఎన్నికల ప్రచారంతో పాటుగా ఇటు అధినేత దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు…

గుంటూరు పశ్చిమంలో టీడీపీకి గతంలో 25 వేలకు పైగా మెజార్టీ లభించింది… అక్కడ పార్టి క్యాడర్ కూడా బలంగా ఉంది.. మోదుగుల పార్టిని వీడినప్పటికి క్యాడర్ మాత్రం పసుపు జెండాను వదిలిపెట్టలేదు .. అదే ధీమాతో అధిష్టానం సరైన అభ్యర్ది ఎంపిక విషయంలో జాప్యం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది .. ఏది ఎమైనా అభ్యర్దిని ప్రకటించకపోయినా పశ్చిమ లో మాత్రం టీడీపీ ఎన్నికల ప్రచారం సాగిపోతోంది … మరి టిడిపి అధినేత ఎవరిని బరిలోకి దింపుతారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here