Home Entertainment Cinema

గులాబీ దళంలో సెగ పుట్టించిన శ్రీ రెడ్డి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ప్రకంపనలు ఇప్పుడు తెలంగాణను తాకాయి. అది కూడా ఇందూరు జిల్లాకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే పై కావడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు అన్ని రంగాలకు సంబంధించిన లైంగిక ఒత్తిళ్లు.. వేధింపులు ఒక్కొక్కటిగా బయటకోస్తున్నాయి. గతంలో లైంగిక వేధింపుల పై పోరాటం అంటూ హడావిడి చేసిన టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి ఈ సంచల ఆరోపణలకు తెర తీశారు.

ఓ ప్రముఖ తమిళ న్యూస్‌ చానల్‌ కు శ్రీ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ఉద్యమం గురించి ప్రస్తావన వచ్చింది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీ తాజాగా అధికారపార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే పేరును ఓపెన్ గా చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. అతడికి అమ్మాయిలంటే పిచ్చి అని అతడు పెద్ద మోసగాడని ఆరోపించింది. అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ సహాయం చేశాడని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాక తాము సినిమాల‌కు బ్లాక్ మ‌నీ పెడ‌తాం అంటూ.. నువ్వు ప‌డుకుంటే అవ‌కాశాలు ఇప్పిస్తామన్నారని ఆరోపించింది శ్రీ‌రెడ్డి.

గతంలో శ్రీరెడ్డి టాలీవుడ్లో లైంగిక వేధింపుల పై సంచలన ఆరోపణలు చేసింది. తర్వాత దీని పై ఒక మూమెంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న శ్రీ ఇప్పుడు ఇందూరు జిల్లాకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై విరుచుకుపడింది. జీవన్ రెడ్డి పెద్ద ఉమనైజర్ అని.. పార్క్ హయత్ లో అతనికి పర్మినెంట్ గా ఒక రూం ఉందని చెప్పారు. తన ముందు డ్రగ్స్ ను తీసుకోవటమే కాదు.. తనకు పర్సనల్ గా కూడా చూపించారాని వెల్లడించింది.

గతంలో పలువురు సినీ ప్రముఖుల పై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఒక టైంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చాలా ఘాటుగా స్పందించింది. తర్వాత వచ్చిన వరుస వివాదాలతో సైలెంట్ అయిన శ్రీ ఇప్పుడు మీటూ తో మళ్ళీ హీట్ పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here