Home News Stories

గులాబీ కారులో ఫైరు

ముందస్తు ఎన్నికల ముహుర్తం ఫీక్స్ చేసుకున్న గులాబీ పార్టీ అధినేత అదే స్పీడ్ లో అభ్యర్దులను ప్రకటించాడు కానీ అంతే స్పీడ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అసమ్మతి కుంపటి రాజుకుంది. అది మెల్లగా ఇతర జిల్లాలకు పాకింది, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే లకు టిక్కెట్లు ఇవ్వడంతో గతంలో పోటి చేసిన అభ్యర్ధుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరికొన్ని చోట్ల సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వడంతో ఆశావహులు అసంతృప్తితో బరస్ట్ అయ్యారు.


గ్రేటర్ పరిధిలోని గులాబీ పార్టీ నేతల్లో అసమ్మతి భగ్గుమంది. టిక్కెట్లు దొరకని నేతల వర్గపోరు అసతృప్తితో బజార్లకెక్కింది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల్లో ఇది కామన్. కాంగ్రెస్,టీడీపీ పార్టీల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆఫీసులు తగల బెట్టిన చరిత్ర ఉంది. దీంతో పోల్చుకుంటే తమ పార్టీ బెటరనుకున్న గులాబీ బాస్ టిక్కెట్లు వచ్చిన వారే అసమ్మతినేతలను బుజ్జగించాలని ప్రకటించి గమ్మున ఉన్నారు.

అసలు పంచాయితీ ఇక్కడే మొదలైంది. జంట నగరాల్లోని సగం సీట్లకు పైగా నియోజకవర్గాల్లో ఇద్దరు నుంచి ఐదుగురు నేతలు టిక్కెట్ల కోసం పోటీ పడ్దారు. స్వయాన హైదరాబాద్ మేయర్ సారే ఉప్పల్ టిక్కెట్ దక్కలేదన్న ఆక్రోశంతో గ్రేటర్ కౌన్సిల్ సమావేశాన్ని పక్కన బెట్టి మరి తాను నమ్ముకున్న తన రామున్న(కేటీఆర్) తనను నిండా ముంచాడని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెంగుళూరు చెక్కేశారు. రెండు రోజుల తర్వాత సిటీలో ప్రత్యక్షమై తన వంది మగదులను ఆందోళనకు దింపారు. ఇక శేరిలింగంపల్లిలో పిరాయింపు ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకే టిక్కెట్ దక్కడంతో కీలక నేత మువ్వా సత్యనారాయణ ఏకంగా జంప్ చేసి టీడీపీలో టిక్కెట్ కోసం ఖర్చిఫ్ వేశారు. మరో నేత కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇండిపెండంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు.

ఇక జూబ్లీహిల్స్,మహేశ్వరం, ఇబ్రహీం పట్నం,ముషీరాబాద్,రాజేంద్ర నగర్ ,మల్కజ్ గిరి లలో ఇదే పరిస్థితి ఉంది. ముషీరాబాద్ లో టిక్కెట్ ఎవరికి ఇవ్వకపోయినా హోంమంత్రి వర్యులు కేసీఆర్ దోస్త్ నాయని నర్సింహారెడ్డి తన అల్లుడి కి ఫస్ట్ లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ పై కస్సుబుస్సు మంటున్నాడు. మహేశ్వరంలో గతంలో పోటి చేసిన కొత్త మనోహర్ రెడ్డి పిరాయింపు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కి టిక్కెట్ ఇవ్వడ పై ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా తీగల ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు.

ఈ అసమ్మతి సెగలు జంటనగరాలతో ఆగలేదు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. టిక్కెట్ ప్రకటించకపోవడంతో వరంగల్ లో కొండ దంపతులు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారయణ తనను టిక్కెట్ హామీతో పార్టీలోకి తీసుకుని నమ్మక ద్రోహం చేశారంటూ రెబల్ గా బరిలోకి దిగబోతున్నారు. ఇక డోర్నకల్ లో సత్యవతి రాధోడ్ పరిస్థితి ఇదే. జనగాంలో ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇవ్వడం పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఆదిలాబాద్ లో పార్టీ నేత రమేశ్ రాథోడ్ టిక్కెట్ రాలేదన్న ఆక్రోశంతో ఖానాపూర్ లో కేసీఆర్ పోటీ చేసినా ఓడిస్తానంటు దనుమడాడు. చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు సీటు ఇవ్వకుండా ఎంపీ బాల్క సుమన్ కు సీటూ ఎలా ఇస్తారంటూ నల్లల ఓదేలు పార్టీతో పంచాయితికి దిగాడు. బెల్లంపల్లి,మంచిర్యాల,సిర్పూర్,నిర్మల్ లోనూ ఇదే పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి,మధిర,పినపాక లో అదే సీన్. మెదక్ జిల్లా నారాయణఖేడ్, పటాన్ చెరువు,నర్సాపూర్, దుబ్బాక లోనూ కారు పార్టీకి తిప్పలు తప్పేలా లేదు. ఉమ్మడి నల్గొండజిల్లా తుంగతుర్తి,నాగర్జున సాగర్,నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,మునుగోడు లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here