Home Health corona

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పెరుగుతోన్న మద్దతు

కోవిడ్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా.. లాభం లేకుండా పోతుంది. వ్యాక్సిన్ వచ్చినా కరోనాను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రభుత్వాలు తల పట్టుకున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ గడ్డుకాలంలో లాక్‌డౌనే సరైన నిర్ణయం అని సుప్రీంకోర్టుతో సహా పలువురు ప్రముఖులు, సర్వేలు తెలుపుతున్నాయి.

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. కేసులతో పాటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలనే స్వరం పెరుగుతోంది. తాజాగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చినట్లు తేలింది. కొవిడ్‌ విలయంతో దేశంలో పరిస్థితులు దిగజారుతున్నందున కొన్నిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి సీఏఐటీ విజ్ఞప్తి చేసింది.ఒకవేళ దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ సాధ్యంకాని పక్షంలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనైనా పూర్తిగా లాక్‌డౌన్‌ విధించాలని కోరారు.

కరోనా సెకండ్ వేవ్‌.దేశంలో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపుతోంది. ఆస్పత్రుల్లో ఒక్క బెడ్‌ కోసం రోగులు అలమటిస్తున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. రోజూ దాదాపు 4లక్షల కేసులు నమోదు కావడంతోపాటు 3వేలకు పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఢిల్లీ లో మే 10 వరకు, గోవాలో మే 3 వరకు, హరియాణా లో మే 31 వరకు పాక్షిక లాక్డౌన్ , జార్ఖండ్ లో మే 6 వరకు , మధ్యప్రదేశ్ లో మే 7 వరకు, మహారాష్ట్ర లో మే 15 వరకు , రాజస్థాన్ లో మే 3 వరకు లాక్డౌన్, మణిపూర్ లో మే 7 వరకు లాక్డౌన్ ఉత్తర ప్రదేశ్ లో మే 4 వరకు లాక్డౌన్ విధించారు. పలు రాష్ట్రాలు వాటిని ఎప్పటికప్పుడు పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here