ప్రకటించిన అభ్యర్ధుల్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదంటోంది టిఆర్ఎస్.. ఆ క్రమంలో అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి .. అయినా వివిధ నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద తప్పడం లేదు గులాబీ పార్టీకి.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోనూ అసంతృప్తి నేతలు తాము పోటీలో ఉన్నామంటూ ప్రచారాలు కూడా మొదలెట్టేశారు.. కొందరైతే పార్టీల బిఫారాలు తమకే దక్కుతాయని చెప్పుకుంటూ ఇంటింటికీ తిరిగేస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం టిఆర్ఎస్లో రెబల్ బెడద గుబులు రేపుతోంది.. సెగ్మెంట్లో ఎప్పటి నుంచో గ్రౌండ్‌వర్క్ చేసుకుంటూ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న గజ్జెల నగేష్.. ఇప్పుడు వలస వచ్చిన సాయన్నకే తిరిగి దక్కడంతో తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.. టిఆర్ఎస్ బీపారం తప్పకుండా తనకే వస్తుందంటూ ఆయన కంటోన్మెంట్లో భారీ ఎత్తున ప్రచారం చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.. ఒకవేళ బి ఫారం దక్కకపోతే రెబల్‌గా పోటీ చేస్తానంటున్నారు నగేష్.
మరోవైపు మేడ్చల్ సెగ్మెంట్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది .. అక్కడ టిఆర్ఎస్ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు … అక్కడ నుంచి ముగ్గురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు .. వారిలో నక్కా ప్రభాకర్‌గౌడ్ టికెట్ దక్కకపోతే రెబల్‌గా పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు .. ఆయనకు మద్దతుగా మేడ్చల్ పట్టణంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి .. ప్రభాకర్‌గౌడ్‌కు కేటాయించాలని .. లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని టిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇక ముషీరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి, ముఠా గోపాల్ కి మధ్య టిక్కెట్ కోసం టఫ్ వార్ నడుస్తుంది. టిక్కెట్ రాని వారు రెబల్ గా బరిలో దిగే చాన్స్ కూడా ఉంది. అంబర్ పేట గులాబీలో కూడ టిక్కెట్ కోసం విపరీతమైన పోటి నెలకొంది. దాదాపు నలుగురు ఆశవహులున్న ఇక్కడ రెబల్ సమస్య అధికారపార్టీకి తప్పకపోవచ్చు.
ఖైరతాబాద్ లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గులాబీ పార్టీ టిక్కెట్ కోసం త్రిముఖ పోరు నడుస్తుంది. పీజేఆర్ కూతురు విజయారెడ్డి,మన్నె గోవర్ధన్ రెడ్డి మొన్నటి వరకు పోటీపడగా ఇప్పుడు మాజీ మంత్రి దానం వీరికి ఏకుమేకయ్యాడు. దానం నియోజకవర్గంలో స్పీడ్ పెంచడంతో వీరిద్దరు తమలో ఎవరికి టిక్కెటిచ్చిన ఓకే కాని దానంకి ఇస్తే ఒప్పుకోం అంటూ అధిష్టానాన్నికి డెడ్లి వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్ లో ఉన్న విభేధాలను అధికార టీఆర్ఎస్ ఎలా సెట్‌రైట్ చేస్తుందా అన్న ఆసక్తి అటు అధికార పార్టీతో పాటు ఇటు విపక్ష పార్టీలోను కనిపిస్తుంది.