Home Videos

రేవంత్ రెడ్డి అభిమానులకు గుడ్ న్యూస్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జీవన్ రెడ్డి,శ్రీధర్ బాబు ఈ పదవి కోసం గట్టిగా పోటీ పడటంతో.. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేసింది. ఆ తర్వాత సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో జానారెడ్డి విన్నపం మేరకు టీపీసీసీ ఎంపిక తాత్కాళికంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతుందని చాలామంది నేతలు చర్చించుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కొనే నాయకుడెవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ కే సాధ్యమనే భావన కాంగ్రెస్ కేడర్ లో ఉంది. దూకుడుగా వెళ్తు పార్టీని నిలబెట్టాలంటే అది రేవంత్ తోనే సాధ్యమని పలువురు డీసీసీ అధ్యక్షులు అభిప్రాయసేకరణలో తేల్చి చెప్పారు. ఇక కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రేవంత్ పట్ల సానుకూలంగా ఉన్నారు. కొందరు సీనియర్లు రేవంత్ కి వ్యతిరేకంగా ఉన్నా చావో రేవో గా కాంగ్రెస్ పరిస్థితి మారడంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here