Home Videos

ఆ మహిళని TRS హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి దింపితే Etela పోటీ చేయడు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాతో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటి నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్దుల పై చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఈటల బీజేపీ గూటికి చేరనుండటంతో బలమైన అభ్యర్థిని దింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో ప్రముఖంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here