తమిళనాడు తిరుచిరాపల్లి లోని ఈశ్వరుని ఆలయం .. పేరు జంబుకేశ్వరర్ దేవాలయం .. అక్కడి అఖిలాండేశ్వరి గుడి సమీపంలో మట్టిని శుభ్రం చేస్తుండగా ఒక మట్టి కుండ బయల్పడింది .. దానిని తెరచి చూడగా 505 బంగారు నాణాలు కనిపించాయి … వాటిపై అరబిక్ లిపి ఉంది. దీనిని బట్టి ఇవి క్రీ.శ. 1000-1200 మధ్య కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇందులో ఒకటి చాలా పెద్ద నాణెం కాగా .,504 మాత్రం చిన్నవిగా వున్నాయి. వీటి బరువు ఒక కిలో 716 గ్రాములు ఉంటుందని తేలింది.

ఏడు అడుగుల లోతులో ఇవి బయటపడ్డాయని తెలిసింది . హిందూ మత సంఘాలు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వీటిని పోలీసులకు అందజేశారు . ప్రస్తుతం ఈ నాణేలను ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నాణేలపై అధ్యయనం జరగనుంది.

అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర ఆలయాన్ని 1800 సంవత్సరాల క్రితం చోళ మహారాజు కొట్చెంగన్నన్ నిర్మించినట్లు నమ్ముతారు. ఈ ఆలయం కాంప్లెక్స్, పెద్ద పెద్ద కట్టడాలు ., గోపురాలతో నిర్మించినట్లు
చెబుతున్నారు. కొంతకాలం, ఈ ఆలయానికి వెండి వాహనాలు ., బంగారు ఆభరణాలు విరివిగా వచ్చినట్లు చెబుతున్నారు . అంతే కాకుండా భూమి విరాళాలు కూడా బాగా వచ్చాయి.