Home Women Recipes

ఆరోగ్యానికి, లైంగిక పటుత్వానికి దివ్యౌషధం వెల్లుల్లి

ఆరోగ్యానికి, లైంగిక పటుత్వానికి దివ్యౌషధం వెల్లుల్లి:ఆరోగ్యాన్ని పెంపొందించటానికి వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆధునిక వైద్యానికి పితామహుడు హిప్పో క్రేట్‌‌స్ వెల్లుల్లిని అంటు రోగాలకు, ఉదర సంబంధ వ్యాధులకు వైద్యంగా ఉపయోగించే వాడని చెబుతారు. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్యాన్ని పెంపొందించటానికి వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆధునిక వైద్యానికి పితామహుడు హిప్పో క్రేట్‌‌స్ వెల్లుల్లిని అంటు రోగాలకు, ఉదర సంబంధ వ్యాధులకు వైద్యంగా ఉపయోగించేవాడని చెబుతారు.

ఆరోగ్యానికి, లైంగిక పటుత్వానికి దివ్యౌషధం వెల్లుల్లి

ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యుల ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ల్యుకోడెర్మా కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.garlic__52884

ఛాతీ సంబంధ వ్యాధులు
ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరిఅయిన ఔషధం అని డాక్టర్‌ మెక్‌డుఫీ కనుగొన్నారు. న్యూమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధమని డాక్టర్‌ ఎఫ్‌. డబ్య్యూ క్రాస్‌మాన్‌ చెబుతున్నారు. తీవ్రమయిన జ్వరంతో ఉన్నవారి48 గంటల లోపల టెంపరేచరును, నాడీ చలనాన్ని, శ్వాసను వెల్లుల్లి దారిలోకి తెస్తుందని అంటున్నారు. వెల్లుల్లిని నీటిలో మరగబెట్టి క్షయవ్యాధి రోగులు సేవిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. ఒక గ్రాము వెల్లుల్లిని ఒక లీటరు పాలు, ఒక లీటరు నీటిలో కలిపి ఆమొత్తం నాలుగోవంతు మిగిలేదాకా మరగబెట్టి ఆ వచ్చిన డికాక్షన్‌ని రోజుకు 3 సార్లు సేవిస్తే క్షయ నయమవుతుంది.

ఉబ్బసం
వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్‌‌ట – వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి పడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.rosemary_garlic_oil_5

జీర్ణకోశ వ్యాధులు
జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణయంత్రాంగానికి సోకే అన్ని రకాల అంటురోగాలనూ వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. అందుకు కారణం- వెల్లుల్లిలో ఉన్న యాంటీ సెప్టిక్‌ గుణం!

హై బీపి నియంత్రణ
బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన మందుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. మందుల షాపులలో లభించే వెల్లుల్లి క్యాప్యూల్‌‌సని రోజుకు రెండు లేదా మూడిటిని వేసుకోవటం ద్వారా బీపిని దారిలోకి తెచ్చుకోవచ్చు.
garlicblog
వాత రోగాలు
రష్యాలో వాతరోగాలకు వెల్లుల్లి ఉపయోగిస్తుంటారు. బ్రిటన్, జపానులో జరిపిన  పరిశీలనలో మిగతా వాతరోగాల మీద ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్  లేకుండా వెల్లుల్లి వైద్యం పని చేసినట్లుగా నిరూపితమైంది. వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాతరోగానికి గురైన ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. వెల్లుల్లి తైలాన్ని చర్మం పీల్చుకొని రక్తంలో కలిసి వేగంగా నొప్పులను నివారిస్తుంది.

గుండెపోటు నివారణ
వెస్ట్ జర్మనీకి చెందిన డాక్టర్లు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని తేలింది. వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట రాల్‌ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందనీ, దీనితో హైబీపీ, గుండెపోటు నివారించబడతాయనీ కోలోన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హామ్‌‌స రాయిటర్‌ అంటున్నారు. గుండె పోటు వచ్చిన రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట రాల్‌ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అంతకు పూర్వం గుండెకు జరిగిన డామేజ్‌ అయితే తొలగిపోదు గాని తిరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తగ్గిపోతాయంటారు.

లైంగిక సంబంధవ్యాధులు
నపుంసకత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని అమెరికా లోని ప్రముఖ సెక్సాలజిస్ట్  డాక్టర్‌ రాబిన్‌సన్‌ పేర్కొంటున్నారు. సెక్స్  సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్స్ సంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు. తరచుగా వెలుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగికపటుత్వం పెరుగుతుంది. లైంగిక క్రియలో అలసట దూరం అవుతుంది.

వంటకాలలో వాడేది  
మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతుంది. వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.
garlicవిటమిన్లూ అధికమే
వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్‌- సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్‌-సితో అల్లిసిన్‌ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్‌-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి
జ్వరాల నుంచి త్వరగా కోలుకోవడానికి, రొంప నుంచి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలు ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్తమాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here