Home Entertainment Cinema

సినీ పరిశ్రమలో విషాదం..ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈరోజు ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకగా చికిత్స తీసుకుంటున్నారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రత్నకుమార్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు రత్నకుమార్‌ డబ్బింగ్‌ చెప్పారు.

ఘంటసాల రత్నకుమార్‌ డబ్బింగ్‌ కి ఒక‌ ప్రత్యేకత ఉండేది. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన డబ్బింగ్‌ చెప్పగా హీరోలు సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌తో పాటు అర్జున్‌, కార్తీక్‌, అరవింద్‌ స్వామికి ఎక్కువగా గాత్రదానం చేశారు. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్‌తో పాటు 30కిపైగా సినిమాలకు మాటలు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here