Home News

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిక ఖరారవ్వడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. ఈటల రాజేందర్‌ ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ పై సంచన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఫాం మీద తాను గెలిచినా అంతకంటే ముందే తనకు ప్రజల మద్దతు ఉందన్నారు.

తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానన్న ఈటల కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్‌ దగ్గర వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు. చివరికి అసెంబ్లీ గేట్‌ వద్ద తమ సహచరులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని కూడా అనుమతించలేదన్నారు. కేసీఆర్‌ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here