మీ ఇంటి వద్ద లేదా ., కాలనీ లో చెట్టు అడ్డం వచ్చిందని కొట్టేశారా… ఇక మీరు బుక్ అయి పోయినట్లే… బీ కేర్ఫుల్…

హైదరాబాద్ కూకట్పల్లి లో ఇందు ఫార్చూన్ ఫీల్డ్ లో అనుమతి లేకుండా దాదాపు 40 చెట్లు కొట్టి వేశారు .. అక్కడ అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు అయితే దీనిపై నిరసన వ్యక్తం అయింది . దాంతో సర్దుకున్న ఇందు ఫార్చ్యూన్ వాళ్ళు కొట్టేసిన చెట్లను ట్రాన్స్ లొకేట్ చేశా మని చెప్పారు. ఇది కూడా శాస్త్రీయంగా జరగలేదని నిర్థారించిన అధికారులు.,
53,900 రూపాయల ఫైన్ విధించారు , కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని నిబంధన పెట్టారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద అపరాధ రుసుము, బదులుగా చెట్లు నాటాలని అటవీ శాఖ. స్పష్టం చేసింది. మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, సిబ్బంది పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.