Home News Updates

ఆ ప్రముఖ సింగర్ కు మత్తు ఇచ్చి …

ఆమె ప్రముఖ సింగర్ .. వరల్డ్ ఫేమస్ కూడా … అయినా సరే.. ముష్కరుల చేతిలో మోసపోయింది … చాలా సంవత్సరాల పటు తన వృత్తి ని పక్కన పెట్టేసింది. ఎందుకు అలా జరిగింది … ఏమిటి విషయం అని ఆరా తీస్తే ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు తెలిశాయి ..

తాను చాలా కాలంపాటు కెరీర్‌ను పక్కనపెట్టేశానని, దీనికి కారణం తనకు ఎదురైన భయంకర అనుభవమేనని లాస్‌ఏంజెలిస్ కు చెందిన ప్రముఖ సింగర్ వెల్లడించారు. కొన్ని ఏళ్ళ క్రితం తనపై కొందరు దాడి చేశారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు మత్తు మందిచ్చారని, ఆపై గదిలో బంధించి బలాత్కరించారని చెప్పారు . ఈ దారుణం కొన్ని రోజులపాటు కొనసాగిందని అన్నారు .. ఈ అనుభవంతో తాను మానసికంగా కృంగిపోయి గాయపడ్డానని చెప్పారు. దీన్నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వెల్లడించారు. ఈ కారణంగానే చాలాకాలం తాను కెరీర్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చిందన్నారు.

ఇంతకు ఆమె ఎవరో తెలుసా … గ్రామీ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సింగర్ . ఆమెకు ఒక షో సందర్బంగా ఎదురైన భయంకరమైన అనుభవం ఇది . ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఆమె.. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తన లాగా మరొక సింగర్ మోసపోకూడదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here