Home Entertainment Cinema

సమంత, నాగచైతన్య మధ్యలో చిచ్చు పెట్టిన జాను..

ఏమో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. సమంత అక్కినేని శర్వానంద్ జంటగా వచ్చిన ఈ సినిమాను ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాడు నిర్మాత దిల్ రాజు. అందులో నాని ముందున్నాడు. కానీ అప్పటికే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దాంతోపాటు ఇంత క్లాస్ సినిమా తెలుగు ప్రేక్షకులు చూడరు అనుకున్నాడో ఏమో గాని 96 సినిమాకు నో చెప్పాడు నాచురల్ స్టార్. ఆ తర్వాత ఈ కథ నాగచైతన్య దగ్గరికి వచ్చింది. కానీ ఆయన కూడా ఈ సినిమా చెయ్యను అని చెప్పినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ముందు ఈ ప్రపోజల్ ను సమంత చైతుల ముందు పెట్టాడని..

ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చేదని దిల్రాజు భావించినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాలో చైతూ నటిస్తే బాగుంటుందని ఒప్పించే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఎందుకో తెలియదు మరి చైతు మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే సమంత పక్కన శర్వాని తీసుకున్నారు. ఈ విషయంలో సమంత కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే సమంత సరసన చైతూ అయితే సినిమాకి విపరీతమైన బజ్ వచ్చేది. కానీ చైతు వదులుకున్నాడు.. కానీ ఇప్పుడు జానూ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాను వదిలేసినందుకు చైతన్యతో సమంత చిన్న గొడవ కూడా పెట్టుకుందని ప్రచారం జరుగుతుంది. అనవసరంగా మంచి సినిమాను వదిలేసావ్ అంటూ భర్తను సమంత నిలదీసిందని తెలుస్తుంది. చైతు కూడా ఈ విషయంలో సమంతకు సారి చెప్పాడని.. ఇకపై మంచి కథలు వస్తే కచ్చితంగా కలిసి నటిస్తానని మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా జాను సినిమాలో చైతు సమంత చేసి ఉంటే రేంజ్ మరోలా ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here