సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని మినార్వా కాంప్లెక్స్ లో ప్రకంపనలు.. కూలిపోతుందనే పుకార్లతో భవనంలోని కార్యాలయాలన్ని కాళీ చేసి పరుగులు తీశారు..భయబ్రాంతులకు గురై బిల్డింగ్ బయటకు వచ్చి రోడ్డు పై నిలబడి బిల్డింగ్ వైపు చూస్తూ నిషెష్టులై పోయారు..

సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అలహాబాద్ బ్యాంక్ ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తేల్చారు..
భవనం కూలడం కాదు బ్యాంక్ లోని లాకార్లను తరలిస్తుండగా భవనంలోని ఐదు అంతస్తులలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు… భవనం కూలడం లేదని తెలియడంతో వివిధ కార్యాలయాల సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
ఏది ఏమైనప్పటికి భవనంలో గతంలో కూడా పెచ్చులుడి పడడం, శిథిలావస్థకు చేరిన పరిస్థితిలో భవనం రూపురేఖలు మారడం భయాందోళనలకు గురిచేస్తుంది..