Home News Updates

ఫ్యాక్ట్ చెక్: వాట్సప్ కాల్ రికార్డ్..మూడు టిక్కుల‌ కండీషన్ ఏంటి ?

సోషల్ మీడియాలో వాట్సాప్ కి ప్రత్యేక స్థానం ఉంది. ముద్దుగా వాట్సాప్ యూనివర్సిటీ అని పిలుచుకునే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఏ సమాచారమైనా కాశ్మీర్ టూ కన్మాకుమారి క్షణాల్లో చక్కర్లు కొట్టేస్తుంది. ఇప్పుడు ప్రైవసీ పాలసీలో ప్రభుత్వం, వాట్సాప్‌ నడుమ జరుగుతున్న వాదోపవాదాల మధ్య ఎన్నో సందేహాలు యూజర్లలో‌ ఉన్నాయి.

కొత్తగా వచ్చిన రూల్స్‌ ప్రకారం ఇక మన వాట్సాప్‌ ఖాతాను బ్యాన్‌ చేయనుందా..వాట్సాప్‌ ని త్వరలో ప్రభుత్వం బ్యాన్ చేసుందా అన్న చర్చ మొదలైంది. ఇక ఈ మధ్య, వాట్సాప్ కోసం నోటిఫై చేయబడిన కొత్త నిబంధనల గురించి ఓ సందేశం చెలామణి అవుతూ ఉంది. ప్రభుత్వం అన్ని వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేస్తుందని, మొబైల్స్‌ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ అవుతాయని, మీరు వాట్సాప్ చేసిన మెసేజ్ కు మూడు టిక్కులు గనుక వస్తే మీ మెసేజ్‌ని మంత్రిత్వ శాఖ గమనిస్తున్నట్లని, రెండు బ్లూ మరియు ఒక రెడ్ టిక్ ఉంటే ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తున్నట్లని మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇందులో నిజం లేదని తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here