Home Entertainment Cinema

‘మాస్టర్ సాంగ్’ అదుర్స్.. విజయ్ కుమ్మేసాడుగా..

ఒకప్పుడు విజయ్ అంటే కేవలం తమిళనాట మాత్రమే పరిచయం. ఆయన సినిమాలు అక్కడ మాత్రమే సంచలనాలు సృష్టించేవి. తెలుగులో కనీసం ఈయన సినిమాలకు పోస్టర్ ఖర్చులు కూడా రావడం లేదనే జోకులు కూడా పేలేవి. కానీ ఇప్పుడు దళపతి విజయ్ అంటే తెలుగులో కూడా సంచలనమే. ఈయన సినిమా కోసం ఇక్కడ కూడా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. అదిరింది సినిమా నుంచి తెలుగులోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన సర్కార్, విజిల్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. దాంతో విజయ్ సినిమా అంటే తెలుగులోనూ మార్మోగిపోతుంది.

ప్రస్తుతం ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై కూడా అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. కార్తితో ఖైదీ లాంటి సెన్సేషనల్ సినిమా తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బిగిల్ సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు వేచి చూస్తున్నారు. దానికితోడు ఐటి దాడులు.. రాజకీయాలు అంటూ విజయ్ మార్కెట్ కూడా డబుల్ అయిపోయింది. ఇలాంటి సమయంలో మాస్టర్ కోసం కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తున్నారు ఫ్యాన్స్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి పాట విడుదలైంది.

అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటను విజయ్ పాడాడు. వై దిస్ కొలెవరీ తరహాలోనే ఎక్కువగా ఇంగ్లీష్ పదాలున్న ఈ పాటను విజయ్ అద్భుతంగా పాడాడు. యూ ట్యూబ్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. కుట్టి స్టోరీ అంటూ సాగే ఈ పాటలో మంచి లిరిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ చాలా చిన్నది.. ఆనందంగా ఉండు అంటూ ఈ పాటలో చెప్పాడు విజయ్. ఫ్యాన్స్‌‌తో పాటు అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే క్యాచీ ట్యూన్ ఇచ్చాడు అనిరుధ్. సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here