Home News

కేసుల పై కోడెల పాట్లు…!

సుదీర్ఘ రాజకీయ అనుభవం .. ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన దిగ్గజం.. అలాంటాయనకి ఇప్పుడు బ్యాడ్‌టైం నడుస్తోంది.. ప్రభుత్వం మారగానే ఎక్కడెక్కడి కష్టాలో వచ్చి చుట్టుకుంటున్నాయి .. ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ పోలీసు కేసులు కూడా నమోదవుతున్నాయి .. వాటిలో నిజానిజాల విషయం పక్కన పెడితే .. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు.. ఎక్కేగడప దిగేగడప అన్నట్లు తనకు పరిచయం ఉన్న పెద్దల చుట్టు తిరుగుతున్నారంట ఈ మాజీ స్పీకర్…

కోడెల శివప్రసాదరావు … నరసరావుపేటలో డాక్టర్‌గా ఉంటూ .. తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ఇమేజ్‌ సంపాదించుకున్న దిగ్గజ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో హోంశాఖ సహా వివిధ పోర్ట్‌పోలియోలు నిర్వహించిన సీనియర్‌ .. రాష్ట్ర విభజన తర్వాత సభాపతిగా వ్యవహరించిన ఆయనకు .. పొలిటికల్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌ మైనస్‌ అయినట్లు కనిపిస్తున్నారు …
సొంత పార్టీ నేతలతో పాటు అధికార పక్షనేతలు కూడా టార్గెట్ చేస్తుండటంతో .. వివాదాలు, కేసుల నుంచి బయటపడటానికి కోడెల కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. కేసుల రాజీ కోసం కోడెల మధ్యవర్తుల ద్వారా పెద్ద తలకాయలను ఆశ్రయిస్తున్నారట…

ఐదు సంవత్సరాల పాటు ఏపీలో ఎదురులేని నేతగా కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం చక్రం చెప్పింది .. ఏపీ లోని 13 జిల్లాల్లో కోడెల కుటుంబం ప్రభావం చూపించిందన్న టాక్‌ ఉంది … దొరికిన చోట దొరికినట్టుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కోడెల కుటుంబసభ్యులు అధికారాన్ని ఉపయోగించి దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి …. పలువురు రోడ్డెక్కి కోడెల కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు .. పోలీసులను సైతం ఆశ్రయించి ఫిర్యాదు చేశారు… వాటిలో కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యాయి…

కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెలపై ఆరోపణలు వెల్లువెత్తుతూ .. కేసులు నమోదవుతున్నాయి .. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పైసా పైసా బెదిరించి మరీ వసూలు చేశారని.. కోట్లాది రూపాయలు సంపాదించారని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు . ఆఖరికి క్రీడాకారులకు పెట్టే భోజనంలో కూడా చేతివాటం ప్రదర్శించి … దిగజారి వ్యవహరించారని ఆ కుటుంబం పై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు … ఈ వ్యవహారం అధికారంలోకి వచ్చిన వైసిపికి అస్త్రంగా మారింది…

అయితే కొందరు బాధితులు పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు .. దీంతో కోడెల తన రాజకీయ అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగిస్తూ రాజీ ప్రయత్నాల్లో పడ్డారంట.. ఇప్పటికే కేంద్రంలో కీలకంగా ఉన్న ఒక రాజకీయ ప్రముఖుడిని ఆయన కుటుంబ కలిసిందని చెపుతున్నారు.. అయితే ఆయన ఇలాంటి విషయాల్లో తాను స్వయంగా ఇన్‌వాల్వ్‌ అవ్వలేనంటూ.. మరో నేతకు విషయాన్ని బదిలీ చేసి సైడ్ అయ్యారట..

అంతే కాదు టీడీపీకి దగ్గరగా ఉండే మరో పెద్దాయన్ని కూడా కోడెల అప్రోచ్‌ అయ్యారంట .. ఒక కాంట్రాక్టర్ తన పై ఫిర్యాదు చేయటంతో నచ్చచెప్పించాలని చూశారంట .. అయితే ఆ కాంట్రాక్టర్ మాత్రం వెనక్కి తగ్గలేదంట .. దాంతో చేసేది లేక ఈ పరిస్థితిని రాజకీయంగానే ఎదుర్కోవాలని భావిస్తున్నారంట కోడెల.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై వైసిపి వారు దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు.. తన ఇష్యూని కూడా అదే గాటిలో కట్టేసి కొంతకాలం సర్దుకుపోవాలి అని తాత్కాలికంగా ఫిక్స్‌ అయ్యారంట ఆయన … ఏం చేస్తారులేండి చేతిలో పవర్‌ లేనప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here